Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ షో ఆగిపోయిందా.. ఈ బ్రేక్స్ ఏంటి బాలయ్యా?

Unstoppable With NBK: ఓటీటీ చరిత్రలో సరికొత్త టాక్ షోకు తెరతీస్తూ తొలి తెలుగు షోను ఆహా పరిచయం చేసింది. అన్‌స్టాపబుల్ షోకు బాలయ్య హోస్ట్ గా నియమించింది. ఈ షో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. బాలయ్య మాస్ డైలాగులతో సెలబ్రిటీల సీక్రెట్ రివీల్ చేస్తూ.. ఈ టాక్ షో ముందుకు దూసుకెళ్తోంది. ఎంతో సక్సెస్‌ఫుల్‌గా తొలి సీజన్ పూర్తి చేసుకుంది. ఇటీవలే సీజన్-2 కూడా ప్రారంభమైంది. రెండు ఎపిసోడ్‌లు కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. సీజన్-2లో ఎవరూ ఊహించని విధంగా ఇంటర్వ్యూకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌ను భారీ ఎత్తున ప్రేక్షకులు ఆదరించారు.

రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. ఈ ఇద్దరు యువ హీరోలు షోలో హంగామా చేశారు. ఈ ఎపిసోడ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నిర్వాహకులు తర్వాత ఎపిసోడ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే మూడో ఎపిసోడ్‌కు మరో ఇద్దరు యంగ్ హీరోలైన అడవి శేష్, శర్వానంద్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఇటీవలే త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడి పవన్ కళ్యాణ్‌ను కూడా షోకు రప్పించడానికి బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ మూడో ఎపిసోడ్‌లో ఎవరూ వస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు.

తాజాగా అన్‌స్టాపబుల్ టీమ్ నుంచి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అన్‌స్టాపబుల్ సీజన్-2 మూడో వారం ఎపిసోడ్ ఈ శుక్రవారం ప్రసారం కావడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్య రేంజ్‌కు సరిపడే గెస్టులు దొరకడం లేదని ప్రచారం వినిపిస్తోంది. దీంతో ఈ షో ముందుకు వెళ్లడం కష్టంగా మారనుంది. అయితే అన్‌స్టాపబుల్ షోకి బ్రేకులు పడటంతో బాలయ్య ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. దీంతో చాలా మంది ఈ షోపై వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: చిరంజీవి జోలికి వస్తే సహించేదిలేదు.. పవన్ మాస్ వార్నింగ్ తో సైలెంట్ అవుతారా?

Pawan Kalyan:  మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ వీడియో పై వైసీపీ నేతలు...
- Advertisement -
- Advertisement -