NTR: ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి రంభ ఏమన్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

NTR: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రంభ పేరు వినగానే ముందుగా ఆమె అందం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇప్పటికీ హీరోయిన్ రంభ అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది రంభ. మెగాస్టార్ చిరంజీవి, శ్రీ వెంకటేష్, బాలకృష్ణ, రాజశేఖర్ లాంటి ఎంతో మంది హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ మలయాళ భాషల్లో కూడా నటించి మెప్పించింది హీరోయిన్ రంభ.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటించకపోయినప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా రంభ ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ఈ సందర్భంగా యాంకర్ అడిగే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు తెలిపింది. ఈతరం హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం అని యాంకర్ ప్రశ్నించగా.. ఆ ప్రశ్నపై స్పందించిన రంభ తనకు త్రిష అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది.

ఎందుకంటే తనతో ఒక రెండు మూడు సార్లు మాట్లాడాను చాలా బాగా మాట్లాడుతుంది. తొందరగా కలిసిపోతుంది అని చెప్పుకొచ్చింది రంభ. ఈ తరం హీరోలలో నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారు? అని ప్రశ్నించగా.. మహేష్ ప్రభాస్ లతో సినిమాలు చేయలేదు ఒకవేళ అవకాశం వస్తే ఆలోచిస్తాను అని తెలిపింది రంభ. అనంతరం ఐటెం సాంగ్స్ గురించి ప్రశ్నించగా తనకు నాచోరే నాచోరే సాంగ్ అంటే చాలా ఇష్టమని, అసంలో ఎన్టీఆర్ కష్టపడితే నాకు క్రెడిట్ వచ్చింది అంటూ నవ్వుతూ తెలిపింది రంభ. మీతో డాన్స్ చేసిన వారిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని యాంకర్ ప్రశ్నించగా ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని సమాధానం ఇచ్చింది రంభ. ప్రభుదేవా మాస్టర్ కాదా అని అడగగా కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా మాస్టర్ ఇస్ వెరీ గుడ్. కానీ డాన్స్ పరంగా మాత్రం తన వరకు జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చింది రంభ.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -