Krithi Shetty: అలాంటి అబ్బాయి కావాలంటున్న కృతిశెట్టి.. దొరకడం సాధ్యమేనా?

Krithi Shetty: ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలోని తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఉప్పెన సినిమా ద్వారా వచ్చిన గుర్తింపుతో టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి రెండవసారి ప్రేక్షకులను అలరించింది.

నాగచైతన్య హీరోగా నటించిన బంగార్రాజు సినిమాలో నాగచైతన్యకి జోడిగా నటించిన కృతి శెట్టి ఇక ఇటీవల విడుదలైన కస్టడీ సినిమాలో కూడా నాగచైతన్య సరసన నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న కృతి శెట్టి తనకి కాబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో తనని పెళ్లి చేసుకోబోయే వాడు చాలా సింపుల్ గా, నిజాయితీగా ఉండాలని తెలిపింది.

 

అంతే కాకుండా తనని చేసుకోబోయే వాడు కొంచం బొద్దుగా కూడా ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను పెళ్లి చేసుకోబోయే వాడి గురించి కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మీడియా సమావేశంలో మరికొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. తనకు రామ్ చరణ్ తో పాటు తమిళ్ హీరో శివ కార్తికేయన్ అంటే చాలా ఇష్టం అని, ఇక ఆలియా భట్ తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది.

 

తమిళ భాష నేర్చుకోవటానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమిళ సినిమాలు చూస్తున్నట్లు తెలిపింది. ఇక చిన్నతనంలోనే యాడ్స్ లో నటించే అవకాశం వచ్చిందని, హృతిక్ రోషన్ నటించిన’ సూపర్ 30′ కూడా నటించానని తెలిపింది. అలాగే శ్యామ్ సింగారాయ్ సినిమాలో సిగరెట్ సీన్ కోసం మూడు రోజులపాటు ప్రాక్టీస్ చేశానని, హాలీవుడ్ సినిమాలు చూసి సిగరెట్ తాగినప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో నేర్చుకున్నానని కృతి శెట్టి తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -