Akhil AKkineni: ఆ హీరోయిన్ పై చేతులేసి అఖిల్ అలా చేశాడా.. ఏమైందంటే?

Akhil AKkineni: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి మనందరికీ సుపరిచితమే. అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకున్నాడు. మరి ముఖ్యంగా అఖిల్ అందానికి యూత్ లో విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. అఖిల్ ఇప్పటివరకు తెలుగులో అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగతావన్నీ కూడా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాతో నటనతో కాస్త బెటర్ అనిపించాడు.

 

ఈ సినిమా అఖిల్ కు అంతో ఇంతో పేరు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. కానీ ప్రేక్షకులు అభిమానులు అఖిల్ నుంచి అంతకుమించి ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అఖిల్ తాజాగా నటించిన సినిమా ఏజెంట్. ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. మమ్ముట్టి చిలక పాత్రలో నటించారు. అఖిల్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా కోసం అఖిల్ కూడా భారీగానే కష్టపడినట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అఖిల్ కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్పెషల్ సాంగ్లో చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సాంగ్ షూటింగ్ యూరప్‌లో జరిగింది. ఇక ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుందట. అయితే అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఊర్వశీ రౌటేలాను వేధించాడని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్‌లో ఊర్వశీ రౌటేలా కొన్ని విషయాలను స్వయంగా వెల్లడించినట్లు కూడా చెప్పారు.తన ట్వీట్ లో అక్కినేని అఖిల్ మెచూరిటీ లేని నటుడు.

 

అతడితో పని చేయడం చాలా అసౌకర్యంగా అనిపించింది అని ఆమె వివరాలను వెల్లడించింది అని వివరించాడు. ఏజెంట్ విడుదల అవుతున్న సమయంలో ఈ వార్త ఇపుడు అక్కినేని అఖిల్ అభిమానుల్లో కలవరం లేపుతుంది. ఈ వార్త అఖిల్ కెరీర్ కు సినిమాకు అడ్డుపడనుందా అంటూ అభిమానులు కలవర పడుతున్నారు. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -